రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే..! 1 m ago
నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత సూపర్ స్టార్ల పేర్లు కూడా ఉన్నాయి. వీరు కనీస ధర రూ.2 కోట్ల తో వేలంలోకి వస్తున్నారు. అలాగే స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ మరికొంతమంది ఆటగాళ్లు కనీస ధర రూ.2 కోట్ల తో వేలంలోకి వస్తున్నారు.